నాయకుడంటే తాను నడిచి ఆ దారిలో మిగతా వారిని నడిపించేవాడే..అలాంటి వారు మనకు రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు.. నాయకుడంటే ప్రభుత్వాన్ని దోచేసుకునేవాడు అని సామాన్యుల అభిప్రాయం.. అయితే ఆ అభిప్రాయాల్ని దూరం చేస్తూ మానవత్వానికి, నాయకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నారు మన కేటీఆర్. ఓ వైపు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనే కాదు..ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు మంచి గుణంతో మనసున్న మారాజుగా అడగకముందే చేయూత నందిస్తు ఆదకుంటున్నారు.
తన అద్భుత మాటతీరుతో తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తున్నారు కేటీఆర్. తన వాక్చాతుర్యంతో ప్రపంచదేశాల పారిశ్రామిక వేత్తలను ఇంప్రెస్ చేసిన రామన్న తాజాగా అరుదైన ఘనతను సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు సాధించి, సత్తా చాటారు. వరల్డ్ టాప్ 30 జాబితాలో మంత్రి కేటీఆర్ కు స్థానం దక్కింది. యావత్ భారతదేశం నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే ఈ టాప్ లిస్టులో చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు కేటీఆర్ కాగా మరొకరు ఎంపీ రాఘవ్ ఛడ్డా. ఈ ఇద్దరిలోనూ మంత్రి కేటీఆరే ముందంజలో ఉన్నారు.
ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి అహరహం శ్రమిస్తున్నారు. అటు అఫిషియల్, ఇటు పర్సనల్ అకౌంట్… ఇలా రెండింటిలోనూ మంత్రి కేటీఆర్ అగ్రస్థానంలో నిలిచారు.
టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ కు చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంత్రి కేటీఆర్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ కు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలంతా అభినందనలు తెలుపుతున్నారు.
Take a bow Boss 👏👏
Telangana IT & Industries Minister @KTRTRS is one of the Top Social Media Influencers at #WEF2023
Only Indian leader on this list! What's more, only leader in the World to have two of his handles in the list – Official & Personal!@MinisterKTR@KTRTRS https://t.co/eIUKbovZmL
— Konatham Dileep (@KonathamDileep) January 17, 2023
ఇవి కూడా చదవండి..