మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నివర్గాల నుండి ముఖ్యంగా ముస్లిం దేశాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వీరిద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది బీజేపీ. ఇక ఇరాన్, ఖతార్, కువైట్ దేశాలు ఏకంగా భారత రాయబార్లకు సమన్లు పంపి నిరసన వ్యక్తం చేయడమే కాదు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో స్పందించారు మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ తప్ప దేశం కాదని తేల్చిచెప్పారు. విద్వేషం వెదజల్లుతున్నందుకు తొలుత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మసీదులు కూల్చివేస్తామని మాట్లాడిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.