గ‌వ‌ర్న‌ర్‌తో మాకే పంచాయితీ లేదు- కేటీఆర్

135
- Advertisement -

గ‌వ‌ర్న‌ర్‌తో త‌మ‌కేమీ పంచాయితీ లేద‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. త‌న‌కు ఏమాత్రం గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని, క‌నీసం రాజ్యాంగ‌బ‌ద్ధంగా ఓ గ‌వ‌ర్న‌ర్‌కు ద‌క్కాల్సిన ప్రొటోకాల్ మ‌ర్యాద కూడా త‌న‌కు ద‌క్క‌డం లేద‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఇటీవల తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. గ‌వ‌ర్నర్‌తో మాకేమీ పంచాయితీ లేదు. త‌న‌కు తానే ఊహించుకుని గ‌వ‌ర్న‌ర్ ఏదో మాట్లాడితే మేం ఏం చేయాలి? కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విష‌యంలో ఇబ్బంది పెట్టినందుకు త‌న‌ను మేం ఇబ్బంది పెడుతున్నామ‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నాటం సరైంది కాదు. మరి న‌ర‌సింహ‌న్ ఉన్న‌ప్పుడు మాకు ఎప్పుడూ ఇబ్బంది కాలేదు. గ‌వ‌ర్నర్ కాక‌ముందు త‌మిళిపై ఏ పార్టీకి చెందిన నాయ‌కురాలో అంద‌రికీ తెలుసు’ అంటూ కేటీఆర్ అన్నారు.

- Advertisement -