- Advertisement -
వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించిన సంగతి తెలిసిందే. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో వరంగల్‌కు చేరుకున్నారు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్. వీరికి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, చీఫ్ విప్ దాస్యం సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు వారికి స్వాగతం పలికారు. మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం నయీం నగర్, కేయూ 100ఫీ ట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
- Advertisement -