మోడీ స్పందించాలి: కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

71
ktr
- Advertisement -

శ్రీ‌లంక ప‌వ‌ర్ ప్రాజెక్టు కోసం అదానీ ప్ర‌య‌త్నించ‌డం, ఇందులో ప్ర‌ధాని మోడీ జోక్యం కూడా ఉంద‌ని ఆ దేశ అధికారులు ఆరోపిస్తున్న త‌రుణంలో అన్నివ‌ర్గాల నుండి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో స్పందించారు మంత్రి కేటీఆర్. ప్ర‌ధాని మోడీ, పారిశ్రామిక‌వేత్త అదానీని విమ‌ర్శిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను కేంద్రం టార్గెట్ చేయ‌డం సాధార‌ణ‌మే….మ‌రి శ్రీలంక ప‌వ‌న విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్ర‌ధాని మోదీ జోక్యం ఉంద‌ని ఆ దేశ సీనియ‌ర్ అధికారులే ఆరోపిస్తున్నారు. దీనిపై మోదీ, అదానీ ఎందుకు స్పందించ‌డం లేదు? అని ప్ర‌శ్న‌లు గుప్పించారు.

- Advertisement -