ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. ఇది తెలంగాణ సామాన్యుడి గళం.. సామాన్య శాస్త్రం అని చెప్పుకొచ్చారు. ఆకాశాన్ని అంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు నియంత్రించే సోయి లేదు.. ప్రజలపై పెట్రో ధరల భారాన్ని తగ్గించాలన్న సోయి లేదని ప్రశ్నించారు. గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదు.. కానీ.. ఆగమేఘాలపై అదానీ కంపెనీని ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యంగా ఉందని విమర్శించారు.
ఇది తెలంగాణ సామాన్యుడి గళం…
“సామాన్య శాస్త్రం”# ఆకాశాన్ని అంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు నియంత్రించే సోయి లేదు
# ప్రజలపై పెట్రో ధరల భారాన్ని తగ్గించాలన్న సోయి లేదు
# గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదుకానీ…
# ఆగమేఘాల మీద అదానీ కంపెనీని
ఆదుకోవడమే మీ ఏకైక… pic.twitter.com/ZezkY72WPv— KTR (@KTRBRS) April 23, 2023