మీ మౌనం దేనికి సంకేతం: కేటీఆర్

106
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ట్విట్టర్ వేదికగా మరోసారి మండిపడ్డారు మంత్రి కేటీఆర్. బీజేపీ ఎంపీల ప్ర‌క‌ట‌న‌ల‌పై మోదీ ఎందుకు మౌనం వ‌హిస్తున్నార‌ని నిల‌దీశారు. మోదీకి చెవులు ఉన్న‌ప్ప‌టికీ, చెవిటి వాడిలా మౌనంగా ఉండ‌టం దారుణ‌మ‌న్నారు. బీజేపీ నేత‌లు మాట్లాడుతున్న తీరు ఆమోద‌యోగ్యంగా ఉందా?..దీనిపై ఎందుకు స్పందరని ప్రశ్నించారు.

ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే విధంగా బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్య‌ల‌ను ట్వీట్ చేస్తూ దీనిపై స్పందించాలని మోడీని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ వ‌ర్మ , ప్రాగ్యా ఠాకూర్‌తో పాటు బండి సంజ‌య్ మాట్లాడిన మాటలను పోస్ట్ చేశారు. మ‌సీదుల‌ను త‌వ్వి చూడండి.. అందులో శివ‌లింగాలు బ‌య‌ట‌ప‌డితే వాటిని ముస్లింల‌కు అప్పంగించ‌డి ,బిల్కిస్ బానో రేపిస్టులు సంస్కారులు అని కొంద‌రు అంటున్నారు దీనిపై మౌనం ఎందుకు అని మోడీని నిలదీశారు.

- Advertisement -