విరాట్‌ కోహ్లీపై మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు..

200
Minister Ktr
- Advertisement -

ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్‌కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఆయన కాస్త సమయం దొరికినా క్రికెట్ మ్యాచ్ లను వీక్షిస్తుంటారు. ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మ్యాచ్‌పై స్పందించారు. టెస్ట్ క్రికెట్ గొప్పదనం గురించి చెప్పారు.టెస్ట్ క్రికెట్‌లో ఏదో మాయ ఉందని కేటీఆర్ అన్నారు. టెస్ట్ మ్యాచుల్లో ఉండే మజానే వేరని చెప్పారు.

ముఖ్యంగా లార్డ్స్ వంటి గ్రౌండ్స్ లో బంతి విపరీతంగా స్వింగ్ అవుతుంటుందని… ఇలాంటి చోట్ల క్రికెట్ ఆడితే భలే ఉంటుందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లీష్ పేస్ బౌలర్ ఆండర్సన్ స్వింగ్ బౌలింగ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఎదుర్కొన్న తీరు అద్భుతమని ప్రశంసించారు. ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్‌కు వైభవాన్ని తీసుకొచ్చాడని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు.

- Advertisement -