ప్రపంచానికి ఇండియా బెంచ్ మార్క్ కావాలని ఆకాక్షించారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జీఈఎస్(ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు) సన్నాహక సదస్సు ఆదివారం (నేడు) జరిగింది.
సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్‌రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, యువపారిశ్రామికవేత్తల తో పాటు ఈ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ .. మనకు కావాల్సిన వనరులను మనమే సృష్టించుకోవాలని, మంచిమంచి ఐడియాలుంటే ఆపే శక్తి ఎవరికీ ఉండదని టీ-హబ్‌ను ఉదహరించారు కేటీఆర్.
ప్రపంచంలో అత్యధికంగా యువత భారత్‌లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. నూతన ఆలోచనలకు భారత్ వేదికగా నిలుస్తుందని, పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్‌ని ప్రపంచమంతా ప్రశంసిస్తోందని కేటీఆర్ గుర్తు చేశారు.
మూడేళ్ల కిందట ఏర్పడిన తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో దేశంలోనే నవంబర్ వన్‌గా ఉందన్నారు. టీఎస్ ఐపాస్‌తోనే ఇది సాధ్యమైందన్నారు కేటీఆర్.