మణిపూర్‌ ఘటనపై మంత్రి కేటీఆర్…

50
- Advertisement -

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ హింసతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఈ ఘర్షణల్లో మృత్యువాతపడగా తాజాగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అనంతరం వారిపై సామూహిత లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై స్పందించారు మంత్రి కేటీఆర్.

ఈ ఘటన చాలా బాధాకరమని… భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతింటున్నా కేంద్రం ఎందుకు మౌనంగా చూస్తోంది అంటూ ప్రశ్నించారు.తాలిబన్ లు పిల్లలను, మహిళలను అగౌరవపరుస్తున్నప్పుడు భారతీయులమైన మనము వారిపై విరుచుకుపడుతున్నాము. అలాంటిది, ఇప్పుడు మనదేశంలోనే మణిపూర్ లో కుకీ తెగ స్త్రీలను మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేయడం బాధాకరం అన్నారు.

Also Read:మణిపూర్‌ అల్లర్లపై బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం..

కొత్త భారతదేశంలో అనాగరిక చర్యలు విచారకరం. ఈ భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్రం మౌనంగా చూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ.. అమిత్‌షా జీ ఎక్కడ ఉన్నారు? దయచేసి అన్నింటినీ పక్కన పెట్టండి. మీ సమయాన్ని, శక్తిని మణిపూర్‌ను రక్షించడం కోసం వినియోగించాలని ట్విట్టర్‌ ద్వారా సూచించారు.

- Advertisement -