2072 వ‌ర‌కు హైద‌రాబాద్‌కు తాగునీటి కష్టాలుండవు..

123
- Advertisement -

హైద‌రాబాద్ న‌గ‌రానికి 2072 వ‌ర‌కు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందు చూపుతో ప్ర‌ణాళిక‌లు రూపొందించామని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్‌కు సమీపంలోని సుంకిశాల వద్ద రూ.1,453 కోట్లతో హైదరాబాద్ మెట్రోవాటర్ అండ్ సివరేజ్ సర్వీసెస్ బోర్డు ఆధ్వర్యంలో ఇన్ టేక్ వెల్‌ను నిర్మిస్తున్నారు. ఈరోజు దానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు 2072 వరకు తాగు నీటికి కష్టాలుండవని చెప్పారు. వరుసగా ఏడేళ్ల పాటు కరవు వచ్చినా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

భవిష్యత్‌లో హైదరాబాద్ 100 కిలోమీటర్ల మేర విస్తరించినా తాగునీటి సమస్యలు రావన్నారు. ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న ప్రాంతాలకు కూడా నీటిని సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు 37 టీఎంసీలుగా ఉందని, మరో 34 టీఎంసీలు కావాల్సి వస్తుందని చెప్పారు. 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67, 2072 నాటికి 70.97 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయన్నారు. సుంకిశాల ఇన్ టేక్ వెల్ తో రోజూ 16 టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది ఎండాకాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నామన్నారు మంత్రి కేటీఆర్‌.

- Advertisement -