సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారంతో తెలంగాణలో గ్రీన్ కవర్ 33 శాతానికి పెరిగిందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన గ్రీన్ ప్రాపర్టీ షోను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడిన కేటీఆర్..హరిత హారం ద్వారా రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 24% నుంచి 33% శాతం వరకు పచ్చదనం పెరిగిందని మంత్రి చెప్పారు. చెట్ల విస్తరణను గణనీయంగా పెంచుకున్నామని, దాంతో రాష్ట్రం మొత్తం పచ్చదనం పెరిగిందని తెలిపారు.గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను గ్రీన్ విలేజెస్‌గా మార్చేందుకు IGBC సహకారం కావాలన్నారు.
Also Read:సినీ స్టార్స్ పై పవన్ స్ట్రాటజీ?
తెలంగాణ ప్రభుత్వం తరపున CII-IGBCకి పూర్తి సహకారం అందిస్తాం అన్నారు. కొత్త సచివాలయ భవనం, టీ-హబ్, టీ-వర్క్స్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త కలెక్టరేట్ భవనాలు, ఆస్పత్రులు, హెల్త్‌కేర్ క్యాంపస్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ టవర్లలో గ్రీనరీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా తెలంగాణ పచ్చని బాటలో నడుస్తోందని చెప్పారు.
Also Read:ఘాటు ముద్దుతో గిన్నిస్ బుక్‌లోకి!