ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్..

91
- Advertisement -

బీజేపీ నేత ఈటల రాజేందర్ భద్రతపై డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు మంత్రి కేటీఆర్ . డీజీపీ అంజనీకుమార్‌తో మాట్లాడిన కేటీఆర్.. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశించారు. కాసేపట్లో IPS అధికారి.. ఈటల ఇంటికి వెళ్లనున్నారు.

Also Read:‘సామజవరగమన’.. ప్రీమియర్ టాక్ ఇదే!

ఇక ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఈటల..హోంమంత్రి అమిత్‌ షాని కలిసి తనకు భద్రత కల్పించాల్సిందిగా కోరారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఈటల చెప్పిన నేపథ్యంలో ఈటలకు Y కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read:‘తొలంగులాసనం’తో ఆ సమస్య దూరం..!

- Advertisement -