బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన మంత్రి కేటీఆర్‌..

132
ktr
- Advertisement -

గ్రేటర్‌ ఎన్నికలలో భాగంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే ఈ మేనిఫెస్టోపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ట్విటర్లో స్పందించారు.టీఆర్‌ఎస్‌ అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలతో బీజేపీ మేనిఫెస్టో రూపొందించడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి కార్యక్రమాలైన షీ-టాయిలెట్స్‌, డంపింగ్‌ యార్డు, మహిళా పోలీస్‌స్టేషన్‌ ఫొటోలతో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్‌ చేసింది.

‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేసిన పనుల ఫొటోలను మీ మేనిఫెస్టోలో పెట్టుకోవడాన్ని కాంప్లిమెంట్‌గా తీసుకుంటాం. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి. పోయినసారి ఏం చేశాం..ఇప్పుడేం చేస్తామో మేం చెబుతాం. ఐదేళ్లలో తెలంగాణలో ఏం జరిగిందో ఆలోచన చేయండి’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

- Advertisement -