ప్రొ.డానియేల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ..

137
ktr
- Advertisement -

అధికారిక పర్యటన మీద ఫ్రాన్స్ రాజధాని పారిస్ వచ్చిన మంత్రి కేటీఆర్ కు ఈ విదేశీ గడ్డ మీద ఒక ఆత్మీయ అతిథి తారసపడ్డారు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు భాష మీద పరిశోధన చేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడే ప్రొఫెసర్ డానియేల్ నెగర్స్ మంత్రి కేటీఆర్ ను కలిశారు.

ఫ్రెంచ్ యూనివర్సిటీ “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓరియెంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్” లో దక్షిణ ఆసియా & హిమాలయన్ స్టడీస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నెగర్స్ గత కొన్నేళ్లుగా తాను తెలుగు భాష పై చేస్తున్న పరిశోధన గురించి మంత్రికి వివరించారు.

వేల మైళ్ళ దూరాన ఉండి కూడా మీరు తెలుగు భాషపై చూపిస్తున్న మమకారం నిజంగా స్ఫూర్తిదాయకం అని మంత్రి కేటీఆర్ ప్రొఫెసర్ డానియేల్ నెగర్స్ ను ప్రశంసించారు.

- Advertisement -