ముగిసిన అమిత్ షా- కేటీఆర్ భేటీ

285
ktr
- Advertisement -

ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసింది.. భేటీలో రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించిన పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తుంది.

ముఖ్యంలగా ఈ సమావేశంలో జిహెచ్ఎంసి పరిధిలోని ఎస్‌ఆర్‌డిపి పనుల్లో భాగంగా రసూల్ పుర వద్ద ప్రతిపాదించిన ఫ్లైఓవర్ కోసం ఇంటర్ స్టేట్ పోలీస్ వైర్‌లెస్ స్టాఫ్ క్వార్టర్స్ కు చెందిన 1.62 ఎకరాల భూమిని అప్పగించాలని మంత్రి కేటీఆర్ అమిత్‌ షాను కోరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మరో చోట స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తుందని మంత్రి తెలిపారు.

ktr

- Advertisement -