పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం సభ్యులతో మంత్రి కేటీఆర్‌ భేటీ..

369
Minister KTR Meeting With Public Affairs Forum Members
- Advertisement -

పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సభ్యులతో మంత్రి కే తారకరామారావు ఈరోజు ఒక వెబినార్ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలోని అనేక కార్పొరేట్ సంస్థల సీనియర్ ప్రతినిధులతో పాటు పబ్లిక్ పాలసీ రంగంలోని ప్రముఖులు సుమారు 70 మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ సమావేశంలో మంత్రితో సంభాషించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను, చర్యలను వివరించారు. దీంతోపాటు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న హెల్త్కేర్ రంగంలోని మౌలిక వసతులను కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు.

ktr meet

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందనీ రానున్న సంవత్సరాల్లో భారీ లక్ష్యాల సాధన కోసం పని చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ సంక్షోభంలోనూ కొత్త అవకాశాలు ఉన్నాయని తాము భావిస్తున్నామని, ముఖ్యంగా భారత దేశ పారిశ్రామిక రంగం ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత ఆపత్కాలంలో భారతదేశం గురించి ప్రపంచ దేశాలు అత్యంత సానుకూల దృక్పథంతో చూస్తున్నాయని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కరోనా కట్టడి విషయంలో భారత దేశం ఇప్పటికే ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశం ఇచ్చిందని, ఈ సందర్భంగా దేశానికి ఉన్న బలాలను ప్రపంచానికి ప్రదర్శించే అవకాశం దొరికిందన్నారు. రానున్న రోజుల్లో వీటిని ఉపయోగించుకొని ఫార్మా, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి వంటి రంగాల్లో వేగంగా ముందుకు పోవాలని కోరారు.

మంత్రితో జరిగిన ఈ సమావేశం, తాము ఇప్పటివరకు హాజరైన సమావేశాలో ఒక అత్యుత్తమమైనది అని పలువురు మంత్రికి తెలియజేశారు. మంత్రి కే తారకరామారావు ఈ సంక్షోభంలోనూ అద్భుతమైన ఆలోచనలతో ముందుకు తీసుకుపోయేలా ప్రయత్నిస్తున్నారని అభినందించారు. పబ్లిక్ అఫైర్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా గౌరవ సభ్యులుగా ఉండాలని ఈ సందర్భంగా పలువురు మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా మంత్రిని పలు అంశాలపైన ప్రశ్నలు అడిగి ఆయన ఒపీనియన్ ని తెలుసుకున్నారు.

- Advertisement -