గౌడవృత్తి వారి అస్ధిత్వానికి ప్రతీక నీరా స్టాల్ అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో తెలంగాణ తొలి నీరా కేఫ్‌కు శంకుస్ధాపన చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…రాష్ట్రంలో గీత వృత్తిపై ఆధారపడి 2 లక్షల మంది జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు.భవిష్యత్‌లో మరిన్ని నీరా స్టాల్స్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ప్రజల్లో ఎంతో వృత్తి నైపుణ్యం ఉందని… కుల వృత్తుల అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనేది సీఎం కేసీఆర్ నమ్మకమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం రూ. 16 కోట్ల వృత్తి పన్ను బకాయిలను రద్దు చేసిందని గుర్తు చేశారు.
గీతవృత్తికి అనుబంధంగా ఎన్నో వృత్తుల వారు అభివృద్ధి చెందారని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గత పాలకులు కల్లు దుకాణాలు మూసివేయించి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారని కానీ తెలంగాణ ప్రభుత్వంలో కల్లుగీత వృత్తి పన్నును రద్దు చేయడంతో పాటు కల్లు దుకాణాలు తెరుచుకున్నాయని మంత్రి తెలిపారు.