- Advertisement -
బుధవారం మంత్రి కేటీఆర్ ఐటీ దిగ్గజం జెడ్ఎఫ్‌కు సంబంధించిన టెక్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇటీవలే ముగిసిన దావోస్ సదస్సులో ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న తమ టెక్ సెంటర్‌ను విస్తరించే దిశగా తెలంగాణ ప్రభుత్వంతో జెడ్ఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఈరోజు ఈ టెక్ సెంటర్‌ను ఇక్కడ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జెడ్ఎఫ్ విస్తరణ కేంద్రంతో తెలంగాణ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు.
ఇక 2017 లోనే జెడ్ఎఫ్ సంస్థ తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. తాజాగా తన విస్తరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, కేటీఆర్ దానిని ప్రారంభించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన విస్తరణ కేంద్రంతో జెడ్ఎఫ్‌కు సంబందించిన ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ సెంటర్ హైదరాబాద్‌లోనే ఏర్పాటైనట్టయింది.
- Advertisement -