రైతు వేదికను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

131
ktr minister
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా, నర్మాల గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతు వేదికల్లో అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. రైతు వేదికల నుంచి నేరుగా విస్తరణాధికారులతో మాట్లాడొచ్చని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఐదు వేల ఎకరాలకు ఓ క్లస్టర్‌, ఓ వ్యవసాయ విస్తరణాధికారి ఉండాలని చెప్పారు.

దేశంలో రైతులకు పెట్టుబడి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న కిసాన్‌ నమ్మాన్‌ నిధి పథకానికి మన రైతుబంధు పథకమే స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. సాగుకు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ అన్నదాత జీవతాల్లో వెలుగు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతుల జీవితాల్లో గణనీయ ప్రగతి వచ్చిందన్నారు. తెలంగాణ రాకముందు రైతులు సాగునీటి కోసం బోరుబావులపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఉండేది. అర్ధరాత్రులు విద్యుత్‌ కోసం పొలాల వద్ద పడిగాపులు గాయాల్సిన వచ్చేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చిందని మంత్రి గుర్తుచేశారు.

- Advertisement -