సిరిసిల్ల‌లో ప‌లు అభివృద్ది ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

356
- Advertisement -

రాష్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో బిజిగా ఉన్నారు. ఉదయం హైద‌రాబాద‌్ నుంచి రోడ్డు మార్గాన సిరిసిల్ల ప‌ట్ట‌ణానికి చేరుకున్నారు. సిరిసిల్ల‌లో అధికారులు, ప‌లువురు ప్ర‌జాప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం సిరిసిల్ల జిల్లాలోని ‌గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో చెక్ డ్యామ్ పనులను మంత్రి ప్రారంభించారు.

అనంత‌రం గ్రామంలోని 33/11kv స‌బ్ స్టేష‌న్ ను ప్రారంభించారు. ఆ త‌ర్వాత న‌ర్మ‌ల గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. మ‌ధ్యాహ్నం భోజ‌నం అనంత‌రం సిరిసిల్ల ప‌ట్ట‌ణంలో అధికారుల‌తో స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశం అనంత‌రం మంత్రి తిరిగి హైద‌రాబాద్ చేరుకోనున్నారు.

- Advertisement -