KTR:జిల్లాకో మెడికల్ కాలేజీ

24
- Advertisement -

కేంద్రం సహకరించకున్నా జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీని ప్రారంభించిన అనంత‌రం మట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎవరిని అడగాలి..?వాళ్లకు టికెట్లు కావాలంటే ఎవరిని అడగాలి..? ఢిల్లీ వాళ్లని అడగాలి..కానీ బీఆర్ఎస్‌కు అలాంటి పరిస్థితి లేదన్నారు.

తొమ్మిదేండ్ల‌లో కేసీఆర్ 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశార‌ని, వచ్చే సంవత్సరం మరో ఎనిమిది కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామ‌ని వెల్లడించారు. వరి ధాన్యం ఉత్పత్తిలోనే కాకుండా డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 22 మంది డాక్టర్లు ఉన్నారని చెప్పారు. మా అమ్మ న‌న్ను డాక్ట‌ర్ చేయాల‌నుకున్నారు. నాన్నేమో న‌న్ను ఐఏఎస్ ఆఫీస‌ర్‌ను చేయాల‌నుకున్నారు. నాకు అప్పుడు ఎంసెట్‌లో 1600 ర్యాంక్ వచ్చింది.. కానీ డాక్టర్ సీట్ రాలేదన్నారు.

సిరిసిల్లలో నన్ను… వేములవాడలో చ‌ల్మెడ‌ లక్ష్మీ నరసింహ రావును మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు కేటీఆర్. నాకు జన్మనిచ్చింది మా తల్లి అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల అని చెప్పారు. మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసినందుకు మా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృతజ్ఞతలు చెబుతున్నారని తెలిపారు.

Also Read:డ్రగ్స్ కేసు పై స్పందించిన హీరో

- Advertisement -