మంత్రి కేటీఆర్ గత కొద్ది రోజులుగా అమెరికా పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఆయన పలు యూఎస్ కంపెనీల ప్రతినిధులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అమెరికాలోని న్యూయార్క్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ (జే & జే) కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు (ఫార్మాస్యూటికల్స్, ఆర్ & డీ) డాక్టర్ మథాయ్ మామెన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.
తెలంగాణ జీవ ఔషధ రంగం అభివృద్ధికై మంత్రి తన ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ రంగంలో అవిష్కరణలను మరింత వేగవంతం చేసేందుకు జే & జే బృందం సూచనలను కోరారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ న్యూయార్క్‌లో ఫైజర్ సీఈవో, చైర్మన్ డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లా మరియు ఈవీపీ, చీఫ్ గ్లోబల్ సప్లై ఆఫీసర్ మైక్ మెక్‌డెర్మాట్ లతో సమావేశమయ్యారు. తెలంగాణ వైబ్రెంట్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ గురించి మంత్రి వారికి వివరించారు. భారతదేశంలో హెల్త్‌కేర్, ఫార్మా రంగానికి సంబంధించి ఫైజర్ కంపెనీ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు.