ఆపదలో ఉన్నకుటుంబానికి అండగా కేటీఆర్‌..

257
Minister KTR
- Advertisement -

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాతో ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు. ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా వెంటనే స్పందిస్తూ ఉంటారు మంత్రి కేటీఆర్‌.. ఇప్పటికే ఎంతో మంది అభ్యర్ధనలకు వేంటనే స్పందించి సమస్యలను పరిష్కరించారు. ఆపదలో ఉన్నకుటుంబాలకు అండగా నిలిచారు. అదే తరహాలో ఈసారి ఆపదలో మరో కుటుంబానికి సహాయాన్ని అంధించారు మంత్రి కేటీఆర్‌. తండ్రి అనారోగ్యం కారణంగా ఐదో తరగతిలోనే చదువు ఆగిన ఓ నిరుపేద విద్యార్థికి మంత్రి కేటీఆర్ చొరువతో భరోసా దొరికింది.

KTR

తన స్నేహితుడు గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, ఆర్థిక ఇబ్బందులతో ఆయన కొడుకు రిత్విక్ చదువు 5వ తరగతితోనే ఆగిపోయిందని, బాలుడిని ఘట్‌కేసర్ ప్రాంతంలోని గురుకుల పాఠశాలలో చేర్పించాలని కోరుతూ సల్లకొండ జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆ ట్వీట్‌ను మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డికి రీట్విట్ చేశారు. దీంతో రిత్విక్‌ను ఉప్పల్‌లోని సోషల్ రెసిడెన్షియల్ స్కూల్లోగానీ, ఘట్‌కేసర్‌లోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్లోగాని చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

రిత్విక్ తరఫు వ్యక్తులు ఉప్పల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణను, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజన్ననను ఫోన్‌ చేసి కలువాలని పేర్కొన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి రిత్విక్ తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రిత్విక్ కుటుంబసభ్యులు కీసరలోని కలెక్టర్ కార్యాలయంలో తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. ఓ వ్యక్తి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్, కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి వెంటనే స్పందించి ఓ పేద విద్యార్థి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ మానవీయతను చాటుకొన్నారు.

- Advertisement -