కుసుమ జగదీష్ కుటుంబానికి కోటిన్నర సాయం..

58
- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడు,ములుగు జడ్పీ ఛైర్మన్‌ కుసుమ జగదీష్ కుటుంబానికి రూ. కోటిన్నర సాయం అందిస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి సంతాపం తెలిపారు.

ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం పట్ల కెసిఆర్ ను ఎంతగానో కలిచివేసిందన్నారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తామని…కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని…పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందన్నారు.

Also Read:KTR:ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నాం

14 ఏండ్లపాటు హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలోనే ఉంటూ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు కుసుమ జగదీష్. తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమంలో ఎంతో కీలకపాత్ర పోషించారు. గత ఎన్నికల సమయంలో ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ఆయనకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అవకాశం కల్పించారు. మల్లంపల్లిలో జరగనున్న జగదీశ్వర్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు మంత్రి కేటీఆర్.

Also Read:వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సాయిచంద్ భార్య

- Advertisement -