సెల్ఫీలు, షేక్‌ హ్యాండ్స్‌తో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి !

216
Minister KTR held up in traffic for 2 hours
Minister KTR held up in traffic for 2 hours
- Advertisement -

నిజమాబాద్‌ పోచంపాడులో గురువారం నాడు జరిగిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రారంభమయ్యేసరికే లక్షల్లో హాజరుకాగా, పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో ట్రాఫిక్ స్తంభించి, అంతకు మూడింతలమంది రోడ్లపైనే ఉండిపోయారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం పూర్వపు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ, స్కూల్ బస్సులు, డీసీఎంలు, ఇతర వాహనాల్లో జనం తరలివచ్చారు.

శ్రీరాంసాగర్ క్రాస్‌రోడ్డు నుంచి రోడ్డు కిరువైపులా, మధ్యాహ్నం ఒంటి గంటవరకు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మంత్రి కే తారక రామారావు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పెర్కిట్ ప్రాంతంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఆయన, అక్కడ నుంచి సభాస్థలికి చేరుకోవడానికి రెండు గంటలు పట్టింది. అప్పటికే సమావేశం ముగియడంతో ఆయన అందరినీ కలిసి వెనుదిరిగారు. ట్రాఫిక్ జాం అయిన చోట కేటీఆర్ ను గుర్తించిన జనాలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, షేక్ హ్యాండ్స్ ఇచ్చేందుకు పోటీపడ్డారు. అంత ట్రాఫిక్‌లో కూడా ఓపిగ్గా ప్రజలతో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు కేటీఆర్. కొందరు కేటీఆర్‌ను నమస్తే అన్న అంటుండగా.. మరికొందరు జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో చూడండి..

- Advertisement -