ట్వీట్ట‌ర్ లో నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు కేటీఆర్ స‌మాధానం..

311
KTR
- Advertisement -

తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటార‌న్న విష‌యం తెలిసిందే. ట్వీట్ట‌ర్ ద్వారా ఎవ‌రూ ప్ర‌శ్నించిన వెంట‌నే స్పందిస్తుంటారు. త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను విలైనంత తొంద‌ర్లో ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తారు మంత్రి కేటీఆర్. ఈసంద‌ర్భంగా తాజాగా మంత్రి నిర్వ‌హించిన ట్వీట్ట‌ర్ చాట్ లో నెటిజ‌న్లు కేటీఆర్ ను ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. నెటిజ‌న్లు అడిగిన ప్రశ్న‌ల‌కు కేటీఆర్ చాలా తెలివిగా స‌మాధానం ఇచ్చారు.

ktr

ప్ర‌పంచంలో మీకు న‌చ్చిన రాజ‌కీయ నేత ఎవ‌రూ అని అడ‌గ‌గా అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా అని చెప్పారు. మ‌రో వ్య‌క్తి చాలా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న అడిగారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గొప్పానా? ప‌్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కేసీఆర్ గొప్ప‌నా అని అడ‌గ‌గా..ఈప్రశ్న‌కు స‌మాధానం మీకంద‌రికి తెలుసు నేను చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఒక రాజ‌కీయ నేత‌గా మీరు సాధించిన గొప్ప విష‌యాలు గురించి చెప్తారా అని అడ‌గ‌గా…ఆ విష‌యాలన్ని నేను రిటైర‌య్యాక చెప్తాన‌న్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే టీఆర్ఎస్ పార్టీ సిద్ద‌మేనా అని మ‌రో వ్య‌క్తి అడ‌గ‌గా…తాము ఎప్ప‌టినుంచో చెప్పిన విధంగా ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా టీఆర్ఎస్ సిద్ద‌మేన‌ని చెప్పారు. క‌త్తి మ‌హేశ్, స్వామి ప‌రిపూర్ణానందల న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌ల‌పై మీ అభిప్రాయ ఏంట‌ని అడ‌గ‌గా..లా అండ్ ఆర్డ‌ర్ విష‌యంలో రాజీప‌డే ప్ర‌సక్తే లేద‌ని..చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుపోతుంద‌న్నారు. ఇక చివ‌రగా మ‌రో వ్య‌క్తి చాలా ఆస‌క్తిర‌మైన ప్రశ్న అడిగాడు. 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో మీరు ఏపీ నుంచి పోటీ చేయాల‌ని నా లాంటి యువ‌కులు కోరుకుంటున్నారు మీరెమంటార‌ని అడ‌గ‌గా..భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి తెలుసు అని జ‌వాబిచ్చారు మంత్రి కేటీఆర్.

 

- Advertisement -