టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్,మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ టీఆరెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో కాంగ్రెస్ నుండి టీఆరెస్‌లో చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ,ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి,నారదాసు లక్ష్మణరావు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రికి అతి ప్రీతి పాత్రమైన జిల్లా కరీంనగర్. అందుకే జిల్లాకు నలుగురు మంత్రులను ఇచ్చారు. మొదటి నుండి ఉద్యమానికి కేంద్ర బిందువు కరీంనగర్ జిల్లా.. మొదటి సింహ గర్జన నుండి మొదలుపెడితే ఉప ఎన్నికతో మళ్ళీ పునర్జన్మ తీసుకొని ఉద్యమానికి కొత్త ఊపిరి ఇచ్చిన జిల్లా ఇది.. మీ అందరి దివేనలతో తెలంగాణ సాధించి రెండవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు.
కేసీఆర్ మంత్రిని చేసింది గంగలను కాదు కరీంనగర్‌లోని ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్తను.. టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టిన ప్రతి ఒక్కరిని.. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అడ్డిమార్ గుడ్డి దెబ్బల నాలుగు ఎంపీ సీట్లు గెలిచారు. తప్పిదారి 4 గెలవగననే అగుతాలేరు. తర్వాత జరిగిన ఎంపిపి,జడ్పిటీసీ ఎన్నికలో రాష్ట్రం మొత్తం టీఆర్‌ఎస్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
రేపు జరగబోయే కార్పొరేషన్ ,మున్సిపల్ ఎన్నికలలో మళ్ళీ టీఆర్‌ఎస్ దే విజయం.కరీంనగర్ కార్పొరేషన్ చరిత్రలోనే పోయిన 5 సంవత్సరాలలో అధికంగా నిధులు మంజూరు అయినాయి.టీఆర్‌ఎస్ పార్టీ ఒక్క మతనికో కులనికో చెందిన పార్టీ కాదు ఇది తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక టీఆర్‌ఎస్ పార్టీ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీసులతో మంత్రి పదవి వచ్చింది. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న. మనందరిది ఒక కుటుంబం ,మన ఇంటి పెద్ద ,మన ఇలవేల్పు కేసీఆర్. ముఖ్యమంత్రి గొప్ప మానవతావాది, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పే వ్యక్తి మన ముఖ్యమంత్రి అని మంత్రి అన్నారు.
రైతుల దీవెనలు,బడుగు బలహీన వర్గాల దివేనలతో రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యారు. కరీంనగర్ ఒకప్పుడు ఎటు చూసినా ఎడారిగా ఉండే ఇప్పుడు గోదారి నీళ్లతో కళకళ లాడుతోంది. కేసీఆర్ నాయకత్వం బడుగు బలహీన వర్గాల కోసం.. పారె గోదారి నీళ్లలో ఎటు చూసినా కేసీఆర్ కనిపిస్తున్నాడని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.