వనపర్తిలో రూ.666.42 కోట్ల అభివృద్ధి పనులు..

41
- Advertisement -

వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం, గంజ్ లో టౌన్ హాల్, సమీకృత మార్కెట్, మెడికల్ కళాశాల ప్రాంతాలను పరిశీలించి అధికారులకు కేటీఆర్ పర్యటన, బహిరంగసభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…రూ.425 కోట్ల మిషన్ భగీరధ ప్రారంభంతో పాటు రూ.73 కోట్ల బైపాస్ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు.

రూ.5.08 కోట్లతో రాజాపేటలో నిర్మించిన 96 డబల్ బెడ్రూం ఇండ్లు లబ్దిదారులకు మంత్రి కేటీఆర్ అందజేస్తారని…రూ.75 లక్షలతో నిర్మించిన ఆచార్య జయశంకర్ పార్క్, కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేస్తారన్నారు. రూ.2.80 కోట్లతో నిర్మించిన షాదీఖానా,రూ.2.75 కోట్లతో నిర్మించే బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.

నాగవరం వద్ద రూ.1.02 కోట్లతో నిర్మించిన భూసార పరీక్షల కేంద్రం, రూ.50 లక్షలతో నిర్మించిన యానిమల్ కేర్ యూనిట్, రూ.కోటితో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ ప్రారంభిస్తారని, రూ.22 కోట్లతో నిర్మించే వనపర్తి కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని, విద్యార్థుల వసతి గృహాలకు శంకుస్థాపన, రాజభవనం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.15 కోట్లతో నిర్మించే అంతర్గత రహదారులు, డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.

Also Read:ప్చ్.. ప్లాప్ కాంబినేషన్ పై భారీ బడ్జెట్?

రూ.కోటితో రాజీవ్ చౌక్ లో నిర్మించిన సురవరం గ్రంథాలయం, గంజ్ లో రూ.20 కోట్ల సమీకృత మార్కెట్, రూ.5.75 కోట్లతో నిర్మించిన టౌన్ హాల్ ప్రారంభిస్తారని…పీర్లగుట్టలో రూ.15.50 కోట్లతో నిర్మించిన 294 డబల్ బెడ్రూం ఇండ్లు, రూ.1.25 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభం చేస్తారన్నారు. రూ.48.50 కోట్లతో నిర్మించే పెబ్బేరు రహదారి పనులు, రూ.25.52 కోట్లతో నిర్మించే జేఎన్ టీయూ హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.

గంజ్ లో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన ,ఈ నెల 29న మొత్తం రూ.666.42 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని వెల్లడించారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని…పెండింగ్ పనులన్నీ పూర్తిచేయాలని అధికారులకు సూచించారు నిరంజన్ రెడ్డి.

Also Read:సనాతన ధర్మం అంటే ఇదేనా..మోడీజీ!

- Advertisement -