మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు మంత్రి కేటీఆర్ హెలికాప్టర్‌లో ఖమ్మం పట్టణానికి చేరుకుంటారు. 9.15 గంటలకు లకారం చెరువుపై రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటేన్, ఎల్‌ఈడీ లైటింగ్‌ను జాతికి అంకితం చేస్తారు.
ఉదయం 9.45గంటలకు రఘునాథపాలెంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సుడా పార్క్, బృహత్ పల్లెప్రకృతివనం ప్రారంభిస్తారు. ఉదయం 10.15 గంటలకు టేకులపల్లిలో 240 డబుల్ బెడ్‌రూం ఇండ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభిస్తారు.10.45 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం పాత మున్సిపల్ కార్యాలయంలో సిటి లైబ్రరీ, ఐటీ హబ్ సర్కిల్ నుంచి జడ్పీ సెంటర్ వరకు నిర్మించిన ఫుట్‌పాత్, దానవాయిగూడెంలో ఎఫ్‌ఎస్టీపీ, ప్రకాశ్‌నగర్‌లోని వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనివాస్‌నగర్‌లో మానవ వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ధంసలాపురం వద్ద ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభిస్తారు.