ఖమ్మం జిల్లా చీమలపాడు టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు మంత్రి కేటీఆర్. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
బాధితులను మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి పరామర్శించారు కేటీఆర్. చీమలపాడు ఘటన దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందని.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించామన్నారు.బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.
చీమలపాడుశివారులో బుధవారం వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అప్పటికే ఎంపీ నామా నాగేశ్వరరావుతోపాటు ఇతర నాయకులు సభాస్థలికి చేరుకున్నారు. నిర్వాహకులు ఒక్కో ప్రజాప్రతినిధిని వేదిక మీదికి ఆహ్వానిస్తుండగా ప్రాంగణానికి సమీపంలోని ఈ క్రమంలో ఓ పూరి గుడిసెలో పేలుడు శబ్దం వచ్చింది. చికిత్సపొందుతూ ఆజ్మీరా మంగు, బానోత్ రమేశ్, ధరంసోత్ లక్ష్మణ్ మృతిచెందారు.
ఇవి కూడా చదవండి..