ఇది తెలంగాణ ఆత్మ గౌర‌వ పోరాట‌ం- మంత్రి కేటీఆర్‌

136
ktr
- Advertisement -

వరి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్‌ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు,తెలంగాణ రైతాంగం రాష్ట్రవ్యాప్తంగా ధర్నలు చేపడుతూ నిరసన తెలుపుతున్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ,టీఆర్‌ఎస్‌ మధ్య మాట‌ల యుద్ధం తాజాగా మ‌రింత ముదిరింది. ధాన్యం కొనుగోళ్లకు ముందుకు రాకుండా కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ నాట‌కాలు ఆడుతోంద‌ని మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు.

యాసంగి వడ్ల కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా లేదని కేసీఆర్‌ ముందే రైతులకు సూచించార‌ని కేటీఆర్ తెలిపారు. రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన కేంద్రంలోని బీజేపీ.. ఇప్పుడు యసంగి ధాన్యం కొనమంటే నాటకాలు చేస్తోందని ఫైర్‌ అయ్యారు. యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రంతో కొనిపించే దిశ‌గా సాగుతున్న ఈ పోరాటం అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. ఇది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటమ‌ని కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -