బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్..

40
ktr
- Advertisement -

బీజేపీ నేత బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బండి చేస్తున్న అబద్దపు ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్ చేశారు. బండి సంజయ్, ఒక వేళ మీరు ఈ నిరాధారమైన బాధ్యతారహితమైన ఆరోపణలను ఆపకపోతే, నేను చట్టపరమైన చర్య తీసుకోవలసి ఉంటుంది అని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. మీరు ఆరోపించిన దానిని రుజువు చేయడానికి మీ వద్ద సాక్ష్యం ఉంటే, దయచేసి దానిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచండి లేదా ఈ అర్థం లేని ఆరోపణలకు బహిరంగంగా క్షమాపణ చెప్పండి అని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు.

కాగా, బీజేపీ పార్టీ నేతలు వారి పార్టీ కార్యకర్తలనే సరిగ్గా చూసుకోని వాళ్లు ప్రజలకు న్యాయం చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ఇటీవల ఓ బీజేపీ కార్యకర్త మరణించగా.. అతని భార్య బండి సంజయ్‌ని నిలదీసింది. నా భర్తకు బీజేపీ అంటే ప్రాణం.. నా భర్త చనిపోయినప్పుడు బీజేపీ నాయకులు ఎవరూ మా కుటుంబాన్ని ఓదార్చలేదు,సహాయం చేయలేదు.. కానీ కేసీఆర్‌ గారు రూ.5లక్షల రైతుబీమాతో మాకు సహాయం చేశారని.. ఇటివల బండి సంజయ్‌ పాదయాత్రలో సదరు మహిళ ఆయనను నిలదీసింది. దీనికి సంబంధించిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్‌ షేర్‌ చేశారు. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు.. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇళ్లు లేదు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -