సీఎం కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని ఆంధ్రాప్రజలే కొనియాడుతున్నారని అన్నారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. ఖమ్మంలోని మధిరలో జరిగిన ప్రగతి సభకు మంత్రి కేటీఆర్ తో పాటు తుమ్మల, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన కేటీఆర్ ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే.. పరిపాలన చేతనవుతుందా అని ప్రతిపక్షపార్టీ నాయకులు ఎద్దేవా చేశారని, కానీ ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందని ఏపీ ప్రజలంటున్నారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఏనాడు కూడా మధిరకు నిధులు కేటాయించలేదని, కానీ టీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక మధిర అభివృద్దికి రూ.15 కోట్లు కేటాయించామన్నారు . తెలంగాణలో ఇప్పుడు సంక్షేమ స్వర్ణయుగం నడుస్తోందని, చరిత్రలో ఇలాంటి స్వర్ణయుగం మళ్ళీ రాదని కూడా వెల్లడించారు.
మధిర ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నా..ప్రజలు మాత్రం ప్రతిపక్షంలో లేరని, సీఎంగా కేసీఆర్ ఉంటే బడుగు బలహీన వర్గాలు చల్లగా ఉంటాయని తెలిపారు. కాగా ఆగష్టు 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మిషన్ భగీరథ పూర్తి చేసి ఇంటింటికీ నీళ్ళిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
అంతేకాకుండా ఆర్అండ్బీ రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు క్లాష్ కాకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉంటేనే కార్పోరేషన్ అనుమతులిస్తుందని, అక్రమం లే అవుట్లు, రెగ్యూలరైజ్ చేసుకోవాలని స్థలాల్లో ప్రభుత్వ బోర్డులు పెట్టాలని అన్నారు. ప్రభుత్వ స్థలాలా కబ్జాలను సహించేది లేదని కూడా ఈ సందర్బంగా వెల్లడించారు కేటీఆర్.