విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి కేటీఆర్..

41
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్‌లు కలిసి ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -