సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ప్రర్యటించారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అర్హులైన పేదవారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేసిన మంత్రి కేటీఆర్.
ఈ పర్యటనలో ముందుగా అనారోగ్యంతో మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా, నర్సింహులపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తెలిపారు.