రాజన్న సిరిసిల్ల జిల్లాను కోనసీమ ధీటుగా తీర్చిదిద్దే బాధ్యత నాదే అన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోన్నారు మంత్రి. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ళ గ్రామంలో 3 కోట్లతో ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెట్ గోదాం ప్రారంభించారు, ఆనంతరం ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ కు భూమిపూజ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో 33/11 KV సబ్ స్టేషన్,అంబులెన్స్ మరియు శాదీఖానా ను ప్రారంభించారు.
ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతుకు అవసరమైన కరంటు అందించడం ప్రాధాన్యత పెట్టుకొని విజయం సాధించామన్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ స్వరాష్ట్రం గుజరాత్ సహా ఎక్కడ 24గంటలు కరంటు సరఫరా చేయడం లేదు . అల్మాస్ పూర్ చెరువును నీటితో నింపడమే కాదు కోనసీమ కు ధీటుగా తీర్చి దిద్దే బాధ్యత నాది. వృత్తి మీద ఆధారపడే వారికి అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నాం. ఒక్క అల్మాస్ పూర్ చెరువే కాదు జిల్లాలోని అన్ని చెరువులు నింపుతామని హామి ఇచ్చారు.