మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతం

438
Ktr
- Advertisement -

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి దావోస్ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాలుగు రోజలుగా దావోస్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం అయింది. 4రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ నాలుగు రోజుల్లో దాదాపు 50కి పైగా సమావేశాల్లో పాల్గోనడంతో పాటు 5బిజినెస్ సెషన్లకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్ధానంలో నిలుస్తున్న అంశాన్ని ఈ సదస్సులో ప్రస్తావించారు. గత ఐదేళ్లుగా హైదరాబాద్ శ్రీఘ్ర గతిన అభివృద్ది చెందుతున్న తీరును అక్కడి ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించారు.

ktr Davos

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా దావోస్ లో ప్రత్యేక పెవిలియన్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఐటీ దిగ్గజాలైన అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోకాకోలా సీఈవో జేమ్స్, సేల్స్ ఫోర్స్ వ్యవస్ధాపకుడు మార్క్ బెన్ లోఫ్ , యూట్యూబ్ సీఈవో సుసాన్ తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణలో ఇన్వేస్ట్ చేసేందుకు పలు సంస్ధలు ఆసక్తి చూపాయి. తెలంగాణలో రూ.500కోట్లు ఇన్వేస్ట్ చేసేందుకు పిరామల్ ఫార్మా గ్రూప్ సంస్ధ ముందుకు వచ్చింది.

- Advertisement -