జన్‌ధన్‌ ఖాతాల్లోకి ధనాధన్‌ డబ్బులు వస్తాయ్‌.. బీజేపీ నేతలకు కేటీఆర్‌ పంచ్‌..

156
- Advertisement -

తెలంగాణలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ దరఖాస్తుల ఉద్యమాన్ని చేపట్టింది. అయితే బీజేపీ నేతలు తలపెట్టిన ఈ దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ప్రధాని మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షల కోసం దరఖాస్తులు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. అర్హులైన తెలంగాణ వాసులంతా బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపాలని.. జన్‌ధన్‌ ఖాతాల్లోకి ధనాధన్‌ డబ్బులు వస్తాయంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

- Advertisement -