అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వాహనాన్ని వెంబడించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గువ్వల బాలరాజుకు చికిత్స అందిస్తుండగా ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదు.. కాంగ్రెస్ నాయకులు బాలరాజు సతీమణినికూడా అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని …శాంతి భద్రతలపై డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.
Also Read:Harishrao:గిరిజన బంధు అమలుచేస్తాం..