దళితబంధుపై మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన..

109
- Advertisement -

శుక్రవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్ పలు అంశాలపై సమీక్షించారు. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకునే వెసులుబాటును స్థానిక అధికారులకు కల్పించాము అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 479 బృందాలు లక్ష యాభై వేల ఇళ్లలో జ్వర సర్వే నిర్వహిస్తున్నారు అని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే హెల్త్ ప్రొఫైల్ స్కీంకు పైలట్ ప్రాజెక్టు కింద రాజన్న సిరిసిల్ల ఎంపికైంది అని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. జిల్లాలోని 13 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో మొదటి విడత దళితబంధు పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. జిల్లాలో ‘మన ఊరు – మన బడి’లో భాగంగా 510 పాఠశాలలను మూడు సంవత్సరాల్లో ఆధునీకరించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

- Advertisement -