దాడిచేసి సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారు : కేటీఆర్‌

184
Minister KTR Comments on Congress Party
- Advertisement -

నల్గొండ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి  అధ్యక్షతన జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో ప్రగతి సభ జరిగింది. ఈ సభకు మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి సమక్షంలో టీడీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి కర్ణటి విద్యాసాగర్‌, చండూరు్‌ జడ్పీటీసీ సంతోష్‌ శేఖర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితోపాటు వివిధ పార్టీలకు చెందిన ముగ్గురు ఎంపీటీసీలు, పలువురు సర్పంచ్‌లు సహా 300 మంది కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ క్రమంలోనే సభకు హాజరైన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..మునుగోడు ప్రజలు ఫ్లోరోసిస్‌ బాధలను చెప్పుకున్నారని, 50 ఏళ్ళకు పైగా అధిరంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు మునుగోడు ప్రజలకు చేసింది ఏమీలేదని అన్నారు. అంతేకాకుండా 2లక్షల మంది ప్రజలను జీవచ్చవాలుగా మార్చింది కాంగ్రెస్సేనని విమర్శించారు.

22 ఏళ్ళకిందట ఎమ్మెల్యేగా సిద్దిపేటలో ఇంటింటికీ నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దని అన్నారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నీళ్ళిచ్చి ఫ్లోరోసిస్‌ను తరిమికొడతామన్నారు. కాగా కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీలో స్వామీ గౌడ్‌ మీద దాడిచేసి సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు.

రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అని తెలిపారు కేటీఆర్‌. కరెంట్‌ చార్జీలు తగ్గించమంటే చంద్రబాబు కాల్పులు జరిపి ప్రజలను చంపించారని అన్నారు. అంతేకాకుండా ముదిగొండ ప్రజలను చంపింది కాంగ్సెస్‌ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ నాయకత్వంలో 25లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాములు నిర్మించామని గుర్తుచేసారు మంత్రి కేటీఆర్‌.

- Advertisement -