స్విట్జ‌ర్లాండ్ లో కేటీఆర్‌కు ఘ‌న స్వాగ‌తం..

94
KTR
- Advertisement -

స్విట్జ‌ర్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు స్థానిక ఎన్నారైలు ఘ‌న స్వాగ‌తం పలికారు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక (డ‌బ్ల్యూ‌ఈ‌ఎఫ్‌) సదస్సులో పాల్గొనడం కోసం మంత్రి కేటీ‌ఆర్‌ లండన్ హిత్రూ ఏయిర్పోట్ నుండి ఆది‌వారం సాయంత్రం స్విట్జ‌ర్లాం‌డ్‌‌లోని జ్యూరిచ్‌ కి చేరు‌కు‌న్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌కు స్నితిక్ అనే బాలుడు మరియు స్విట్జ‌ర్లాండ్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నారైలు, తదితరులు ఘ‌న స్వాగ‌తం పలికారు.

త‌న‌పై స్నితిక్‌కు ఉన్న అభిమానం ప‌ట్ల కేటీఆర్ ముగ్దులైపోయి ఆ అబ్బాయితో సెల్ఫీ దిగి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ సంద‌ర్భం లో గందె శ్రీధ‌ర్, అల్లు, అనిల్ జాల‌, తిరుప‌తి ప‌త్తిపాక‌, కృష్ణారెడ్డి,ప‌ద్మ‌జా రెడ్డితో పాటు త‌దిత‌రులు ఉన్నారు.

- Advertisement -