మేఘనను అభినందించిన మంత్రి కేటీఆర్‌..

793
ktr
- Advertisement -

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ 2020 తుది పరీక్ష ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 83వ రాంక్ సాధించిన వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ డైరెక్టర్ కమర్సియల్ కె రాములు కుమార్తె కావలి మేఘన ఈ రోజు ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కావలి మేఘనను సత్కరించి.. అభినందించారు.

వీరితో పాటు కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లా రెడ్డి, తాండూరు నియోజకవర్గ శాసన సభ్యులు పి రోహిత్ రెడ్డి, కె భాస్కర్ మాజీ ఎంపీటీసీ, బషీరాబాద్ లు కావలి మేఘనను అభినందించారు.

- Advertisement -