సానియా గుడ్‌ బై చెప్పడం బాధాకరం..

100
- Advertisement -

టెన్నిస్‌కు సానియా గుడ్ బై చెప్పడం బాధాకరమన్నారు మంత్రి కేటీఆర్.హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సానియా మీర్జా ఫేర్ వల్ మ్యాచ్కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే సానియా మీర్జా లాస్ట్ మ్యాచ్ చూసినట్లు చెప్పారు. భవిష్యత్లో తన లాంటి ప్లేయర్లను తీర్చిదిద్దాలని కోరారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్లో రాణించి తెలంగాణతో పాటు దేశానికి సానియా మీర్జా ఎంతో పేరు తెచ్చిందని ప్రశంసించారు కేటీఆర్. 22 ఏళ్ల క్రితం ఎల్బీ స్టేడియంలో తొలి టెన్నిన్ మ్యాచ్ ఆడిన సానియా మీర్జా..చివరి మ్యాచ్ ఇక్కడే ఆడటం సంతోషంగా ఉందన్నారు.

సొంత గడ్డపై అభిమానుల సమక్షంలో టెన్నిస్ కు వీడ్కోలు పలకడం సంతోషంగా ఉందని సానియా మీర్జా తెలిపింది. ఇన్నాళ్లు ఆటకు అంకితమైన తాను ఇక భవిష్యత్‌ తరాన్ని తీర్చిదిద్దడం కోసం తన సమయాన్ని వెచ్చిస్తానని చెప్పింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -