దేశానికే తలమానికంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. పీవీ మార్గ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహా పనులను కేటీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పరిశీలించారు.
అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ సాధ్యమైందని మంత్రి స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలు దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మహనీయుడు కలలుగన్నట్టు అందరికీ మేలు జరగాలని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ లోగా ప్రతిష్టిస్తామని …గత 8 నెలలుగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. పర్యాటక రంగాన్ని ఆకర్షించేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామని…. దీంతో పర్యాటక రంగం పుంజుకుంటుందని తెలిపారు.