పట్టణాల పురోగతికి మరిన్ని నిధులు- కేటీఆర్‌

307
Minister KT Rama Rao press note on TUFIDC funds to the ULB's in the state
- Advertisement -

పట్టణాల పురోగతికి టియూయఫ్‌ఐడిసి( తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ప్రాస్ట్రక్టర్ డెలవలప్ మెంట్ కార్పోరేషన్) ద్వారా మరిన్ని నిధులు ఇవ్వనున్నట్లు మంత్రి పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ రోజు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, మున్పిపల్ కమీషనర్లతో మంత్రి విడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. పట్టణాల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ది కార్యక్రమాల కొరకు టియూయప్ఐడిసి( తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ప్రాస్ట్రక్టర్ డెలవలప్ మెంట్ కార్పోరేషన్) ద్వారా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.

రాష్ర్టంలోని పట్టణాల అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇప్పటికే పట్టణాలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రత్యేక నిధులు ఇస్తుందన్నారు. తెలంగాణలో సుమారు 39 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉన్నదని, త్వరలో ఏర్పడనున్న నూతన పురపాలికలతో ఈ శాతం మరింతగా పెరుగుతుందన్నారు. పట్టణాలను పక్కా ప్రణాళికలతో అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజల అవసరాల మేరకే పట్టణాల్లోని మౌళిక వసతులు మొరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.

నూతనంగా ఎర్పడిన కొత్త జిల్లాల కేంద్రాలు, ఇతర పట్టణాలను ప్రణాళిక బద్దంగా పక్కా రోడ్డు మ్యాపుతో అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్లకు తెలిపారు. పట్టణాలకు టియూయఫ్ ఐడిసి ద్వారా ఇస్తున్న నిధులను నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యేలా పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పట్టణంలో చేపట్టాల్సిన పనుల విషయంలో సిద్దిపేట పట్టణాన్ని ఒక రోల్ మాడల్ గా తీసుకోవాలన్నారు. పట్టణంలోని జంక్షన్ టూ జంక్షన్ రోడ్ల అభివృద్ది, మాడల్ మార్కెట్లు, పుట్ పాత్లు, బస్ బేలు, మురికి కాలువల అభివృద్ది, శ్మశన వాటికలు, పార్కుల అభివృద్ది మెదలయిన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ పనులు పూర్తి చేస్తే పట్టణాల్లో గుణాత్మక మార్పు వస్తుందని మంత్రి తెలిపారు.

   Minister KT Rama Rao press note on TUFIDC funds to the ULB's in the state

జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకోవాలి. జిల్లాస్ధాయిలో కలెక్టర్లు పట్టణాల అభివృద్ది పనుల భాద్యతలను తీసుకుంటే అభివృద్ది పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి పట్టణానికి ఒక ఫేస్ లిప్ట్ ఉండేలా అధికారులు పనిచేయాలన్నారు. ఇప్పటికే ప్రతి పట్టణంలో మిషన్ భగీరథ కార్యక్రమంలో పనులు ప్రారంభం అయ్యాయన్నారు. ప్రస్తుతం ఇస్తున్న టియూయప్ ఐడిసి నిధులు పురపాలికలకు అర్ధిక సంఘంతోపాటు వివిధ మార్గాల్లో వచ్చే నిధులకు అదనంగా వచ్చే నిధులని మంత్రి తెలిపారు. టియూయప్ ఐడిసి పనులను పర్యవేక్షించే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ ఈ మెత్తం పనులను పర్యవేక్షిస్తుందన్నారు.

ఈ నిధులతో ఏఏ పనులు చేపట్టనున్నారో సాద్యమైనంత త్వరగా గుర్తించి, మార్చినెలాఖరు నాటికి చేపట్టాల్సిన అభివృద్ది పనులు వివరాలను కలెక్టర్లు అందించాలన్నారు. ప్రతి పనికి గడువు( టైం లైన్లు) పెట్టుకోవాలన్నారు. కలెక్టర్లు, జాయింట్ క్షేత్రస్ధాయితో పర్యటిస్తూ పనుల పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి వారం ఈ పనుల పురోగతిపైన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవాలని అదేశించారు.

ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, టియూయఫ్ ఐడి చైర్మన్ విప్లవ్ కూమార్, ఇతర మున్సిపల్ శాఖాధికారులు పాల్గోన్నారు.

- Advertisement -