మైనారిటీల సంక్షేమంపై మంత్రి కొప్పుల సమీక్ష..

117
Minister koppula
- Advertisement -

మైనారిటీల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షించారు. హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సంబంధిత ఉన్నతాధికారులతో సుమారు రెండు గంటల పాటు ఈ సమీక్షా సమావేశం జరిగింది. గురుకులాలకు సుమారు 50శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని,రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతుందని అధికారులు మంత్రికి వివరించారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలవుతున్నాయని,విద్యార్థులందరు ఆరోగ్యంగా ఉన్నారని,రెండు షిఫ్ట్ ల్లో తరగతులు నిర్వహిస్తున్నామని మంత్రికి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం,జాతీయ పోటీ పరీక్షల్లో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.

- Advertisement -