సింగరేణిని ప్రైవేటు పరం చేస్తే ఊరుకోం- మంత్రి కొప్పుల

204
- Advertisement -

లాభాల్లో కొనసాగుతున్న సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పగించడం సరైన విధానం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ రెండవ బొగ్గుగని సందర్శించి కార్మికులను, కార్మిక సంఘాల నాయకులను కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే భారీ పరిశ్రమగా ఉన్న సింగరేణి సంస్థను బిజెపి సర్కారు ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మికులు చేస్తున్న 3 రోజుల సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేస్తే స్థానికంగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సింగరేణి బొగ్గు బ్లాకులను తిరిగి సింగరేణికి అప్పగించాలని పేర్కొన్నారు.

- Advertisement -