వడ్లు కొనేదాక పోరాటం చేస్తాం- మంత్రి కొప్పుల

77
Minister koppula
- Advertisement -

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ఇంటిపై నల్లజెండాలతో నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. కేంద్రంలో బాధ్యతయుతమైన ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బిజెపి, తెలంగాణ విషయంలో బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వానకాలం, యాసంగిలోను వరి మాత్రమే పండుతుందన్న విషయం తెలిసినా, యాసంగిలో వడ్లు కొనమని చెప్పడం అత్యంత దుర్మార్గమన్నారు.

తెలంగాణ వాతావరణం ఉష్ణ వాతావరణమని ప్రపంచానికంతటికి తెలిసిందేనని, యాసంగి సమయంలో ఊష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోతాయని, అంతటి వేడిలో వడ్లు పగులుతాయన్నారు. వడ్ల పగులకుండా ఉండేందుకే బాయిల్డ్ చేస్తారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసున్నారు. అన్ని తెలిసినా, కేంద్ర ప్రభుత్వం రా రైస్ తీసుకుంటామని,బాయిల్డ్ రైస్ తీసుకోమని కొర్రీలు వేయడం తెలంగాణ రైతుల గోసపోసుకునేందుకే అని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ప్రపంచానికే పోరాటా పాటాలు చెప్పిన కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉందని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం పెద్ద విషయం కాదన్నారు. తెలంగాణ ఉద్యమ వాడి వేడిని మరోసారి డిల్లీప్రభుత్వంకు చూపుతామని, తెలంగాణలో యాసంగి వడ్లను కొనేదాక పోరాటం చేస్తామన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

- Advertisement -